
ఉక్కుపై అదే పాట
● వచ్చారు.. వెళ్లారు.. పాత కబురే చెప్పారు
వేతనాలపైనా
గాలి మాటలేనా.?
వివిధ ఉక్కు సంఘాల ప్రతినిధులు ఉదయం నుంచి మంత్రులతో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించారు. కానీ సాయంత్రం స్టీల్‌ప్లాంట్ నుంచి ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు సంఘ నేతలను రావాలంటూ మంత్రులు పిలుపునిచ్చారు. వెళ్లగానే ఎలాంటి ఆందోళనలు చేయకుండా సంయమనం పాటిస్తే.. మంచిరోజులు వస్తాయంటూ ఉద్భోద చేశారు. సెయిల్‌లో విలీనంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా.. మాట మార్చి వచ్చిన నిధులతో ప్లాంట్‌ను గాడిలో పెడదామని హితవుపలికారు. రెండు మూడు నెలల్లో పూర్తి వేతనాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని చెప్పేసి.. అక్కడి నుంచి పయనమయ్యారు. కార్మికుల మాట వినకుండానే పర్యటన ముగించేశారు. ఢిల్లీలో వేతనాలు గురించి అడిగినప్పుడు ప్యాకేజీ వచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు మొత్తం చెల్లించేస్తామని.. అంతవరకూ ఎలాంటి ఆందోళనలు చెయ్యొద్దని చెప్పిన మంత్రి.. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇంకో మూడు నెలలు ఆగాలని చెప్పడంపై మండిపడుతున్నారు.
ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటూ మరోసారి చెప్పిన కేంద్ర మంత్రి కుమారస్వామి
సెయిల్‌లో విలీనంపై మాట దాటవేసిన మంత్రులు
కేంద్ర ఉక్కు శాఖ మంత్రుల పర్యటనపై కార్మిక వర్గాల అసంతృప్తి
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి విద్యార్థులతో రోడ్‌షోలు నిర్వహించిన బీజేపీ
అపాయింట్‌మెంట్ కోసం కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎదురుచూపులు
నిధులు విడుదల చేసినంత మాత్రాన ప్లాంట్‌కు ఒరిగిందేమీ లేదంటున్న సంఘాల నేతలు
చివరి నిమిషంలో సెయిల్‌తో చర్చలు కూడా రద్దు చేసుకున్న మంత్రులు
Comments
Please login to add a commentAdd a comment