బాల కార్మిక రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
సీతంపేట: బాల కార్మిక రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం బాలకార్మిక నిర్మూలన చట్టం 12వ టాస్క్‌ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వాళ్లని బడిలో చేర్పించేందుకు కృషి చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను ప్రొత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్మికశాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎం.సునీత మాట్లాడుతూ జిల్లాలో 10 ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి 170 మంది పిల్లలను కార్మిక స్థితినుంచి రక్షించినట్టు తెలిపారు. 10 కేసుల్లో చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. 9 కేసుల్లో రూ.20 వేలు చొప్పున బాల కౌమార పునరావాస నిధికి సేకరించామన్నారు. జనవరి 10 నుంచి మార్చి 31 వరకు త్రైమాసిక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోలీసు, కార్మిక, రెవెన్యూ, విద్య, ఆరోగ్య, శాఖ అధికారులతో పాటు ఎన్జీవో ప్రతినిధులు, జిల్లా బాల పరిరక్షణ యూనిట్ సభ్యులతో ప్రత్యేక రక్షణ బృందం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం కార్మికశాఖ రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు.
చిన్నారులపై లైంగిక దాడికి ప్రయత్నిస్తే కఠిన శిక్షలు
Comments
Please login to add a commentAdd a comment