ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లతో ఎంఎస్‌ఎంఈలకు ఆసరా
అక్కిరెడ్డిపాలెం: వెండర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంలో భాగంగా బయ్యర్, సెల్లర్ మీట్ కమ్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లతో ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్ మద్దతు మరింతగా అందించవచ్చని వివిధ సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఆటోనగర్‌లోని ఎంఎస్‌ఎంఈ– డీఎఫ్‌వో విశాఖ క్యాంపస్‌లో వాసీవా సహకారంతో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను సోమవారం నిర్వహించారు. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలనీ(పీపీపీ) 2012 ప్రకారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ విభాగాలు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్(సీపీఎస్‌ఈ)లు తమ వార్షిక కొనుగోళ్లలో కనీసం 25 శాతం వస్తువులు, సేవలను ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌పీసీఎల్ (మెటీరియల్స్) సీజీఎం కె.తిరుమురుగన్, బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎం సత్యప్రసాద్‌లు పాల్గొని పీపీపీ–2012 గురించి విపులంగా వివరించారు. వాసీవా సంయుక్త కార్యదర్శి ఈడుపుగంటి అనార్‌బాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన అవకాశాలను కల్పించి, వారిని ప్రోత్సహించాలన్నారు. ఎగ్జిబిషన్లో 6 సీపీఎస్‌ఈలు, 22 ఎంఎస్‌ఎంఈలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఎంఎస్‌ఎంఈ ఏడీ, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ అప్పికొండ శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ జాయింట్ డైరెక్టర్ ఎస్.విజయ్‌కుమార్, ఎం.సుధీర్ అడ్వకేట్, హెచ్‌పీసీఎల్ జనరల్ మేనేజర్ ఎం.సుధాకర్, డీసీఎం, ఆర్‌ఐఎన్‌ఎల్ స్మిత రేవతి, యూకో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ డి.వి.రావు, పోవా అధ్యక్షుడు సత్యన్నారాయణ, వాసీవా కార్యదర్శి వి.రామ్ ప్రసాద్, ఎంఎస్‌ఎంఈ ఏడీలు డాక్టర్ కెఎల్‌ఎస్ రెడ్డి, చంద్రమౌళి, ప్రభాకర్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment