సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన పరిధి పంచగ్రామాల్లో ఉన్న ఇళ్లను దేవస్థానం అధికారులు పునఃపరిశీలన చేయనున్నారు. దేవస్థానం భూసమస్య పరిష్కారంలో భాగంగా తొలుత ఇళ్ల నిర్మాణాల సమస్యని తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఇటీవల సింహాచలం దేవస్థానం అధికారులను ఆదేశించింది. 2008లోనే పంచగ్రామాలైన అడవివరం, వేపగుంట, చీమలాపల్లి, వెంకటాపురం, పురుషోత్తపురంలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు జరిగాయో దేవస్థానం సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టులో మొత్తం 12,149 నిర్మాణాలున్నట్లు లెక్క తేల్చింది. హైకోర్టుకు కూడా ఆ నివేదికను సమర్పించింది. అప్పటి నుంచి ఆ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు, ప్రత్యామ్నాయంగా దేవస్థానానికి ప్రభుత్వ స్థలాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ జాబితాలోని నిర్మాణాలను మరొకసారి పరిశీలించి నివేదిక అందించాలని దేవస్థానం అధికారులను దేవదాయ శాఖ ఆదేశించింది. ఈ పరిశీలన కోసం దేవస్థానం అధికారులతో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. అప్పటి నివేదిక ఆధారంగా ఆయా నిర్మాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించి, తుది నివేదికను కమిషనర్‌కి సమర్పిస్తామన్నారు.
సింహాచలం దేవస్థానం అధికారులతో
మూడు బృందాల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment