ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల నిర్వహించే సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం పూర్తయింది. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కేంద్రం నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాలకు 13 మంది పీవోలను, 13 మంది ఏపీవోలను, 26 మంది ఓపీవోలనుకలెక్టర్ హరేందిరప్రసాద్ కేటా యించారు. అదనంగా 20 శాతం అంటే.. మరో 10 మంది సిబ్బందిని కూడా కేటాయిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. విధులు కేటాయించిన వారందరికీ అధికారిక పత్రాలను అందజేశారు. అనంతరం డీఆర్‌వో బీహెచ్ భవానీ శంకర్, శిక్షణ నోడల్ అధికారి సుధాసాగర్ ఆధ్వర్యంలో పీవో, ఏపీవో, ఓపీవోలకు ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించిన శిక్షణ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment