వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎంగా లలిత్ బోరా బాధ్యతల స్వీ
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎంగా లలిత్ బోరా సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1998 బ్యాచ్ ఐఆర్‌టీఎస్ అధికారైన లలిత్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐఐటీ బొంబాయి నుంచి బీటెక్(ఎలక్ట్రికల్ ఇంజనీర్), బిట్స్ పిలానిలో ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తి చేశారు. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్, చీఫ్ పాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా గతంలో ఆయా ప్రాంతాల్లో పనిచేశారు. వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎంగా పనిచేసిన సౌరబ్ ప్రసాద్ లంచం తీసుకొని దొరికిపోయి సీబీఐ కేసుల్లో ఇరుక్కున్నారు. అప్పటి నుంచి ఏడీఆర్‌ఎం మనోజ్‌కుమార్ సాహూ డీఆర్‌ఎంగా ఉన్నారు. లలిత్ బోరాను డీఆర్‌ఎంగా డిసెంబర్ 26న రైల్వే బోర్డు నియమించగా సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment