కొనాలంటే బర్డ్ ఫ్లూ ఫ్రీగా ఇస్తే క్యూ
● పలు చోట్ల ఫ్రీగా చికెన్, ఎగ్
వంటకాల పంపిణీ
● బారులు తీరిన జనం●
● ఫిష్, మటన్ షాపుల కళకళ
● చికెన్ షాపుల వెలవెల
సాక్షి, విశాఖపట్నం : చికెన్ తింటే బర్డ్ ఫ్లూ.. గుడ్డు తింటే బర్డ్ ఫ్లూ.. అంటూ భయపడుతున్న జనం.. దుకాణాలకెళ్లి చికెన్, గుడ్లు కొనడం మానేశారు. నిపుణులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా.. వైద్యులు ఇంకెన్ని సూచనలు చేసినా.. అబ్బే మేం తినం గాక తినం అంటూ నోరుకట్టుకుని కూర్చున్నారు. దీంతో కొద్ది రోజులుగా నగరంలోని చికెన్ దుకాణాలన్నీ వెలవెలబోతుండగా... మటన్, చేపల దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఫిషింగ్ హార్బర్‌లో చేపలకు డిమాండ్ ఏర్పడింది. ఆదివారం కావడంతో నగరవాసులంతా చేపల కొనుగోళ్లకు క్యూ కట్టారు. జిల్లాలో చికెన్ కొనుగోళ్లు దాదాపు 70 శాతం వరకూ పడిపోయాయి. కానీ దొండపర్తిలో మాత్రం ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. చికెన్ కొనండి అంటే అమ్మో.. బర్డ్‌ఫ్లూ వచ్చేస్తుందని పారిపోయిన ప్రజలు.. ఇక్కడ ఫ్రీగా చికెన్, గుడ్లు పంచుతుంటే మాత్రం బర్డ్ ఫ్లూ లేదు ఏమీ లేదు అంటూ.. బారులుదీరారు. పలువురు వ్యాపారులు, పౌల్ట్రీ యజమానులు కలిసి దొండపర్తి ఎరుకమాంబ గుడి సమీపంలో చికెన్ వంటకాలు, ఎగ్ స్నాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేయడంతో వందలాది మంది లొట్టలేసుకొని మరీ తిన్నారు. ఈ ఉచిత చికెన్ మేళాలో వందల కేజీల చికెన్, వందలాది గుడ్లుతో తయారు చేసిన స్నాక్స్ ఉచితంగా పంచారు. చికెన్‌తో ఎలాంటి రోగాలు రావని.. ప్రతి ఒక్కరు తినొచ్చని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశామని నిర్వాహకులు తెలిపారు. అలాగే కోరమాండల్ సమీపంలో పౌల్ట్రీ నిర్వాహకులు చికెన్, ఎగ్ ఫ్రై పంపిణీ చేశారు. ఆ దారిన పోయే వారు లొట్టలు వేసుకుంటూ హాయిగా చికెన్,ఎగ్‌లను ఆరగించారు.
కిటకిటలాడుతున్న ఫిషింగ్ హార్బర్
కొనాలంటే బర్డ్ ఫ్లూ ఫ్రీగా ఇస్తే క్యూ
కొనాలంటే బర్డ్ ఫ్లూ ఫ్రీగా ఇస్తే క్యూ
కొనాలంటే బర్డ్ ఫ్లూ ఫ్రీగా ఇస్తే క్యూ
కొనాలంటే బర్డ్ ఫ్లూ ఫ్రీగా ఇస్తే క్యూ
Comments
Please login to add a commentAdd a comment