సర్వేలు వేగవంతం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం
మహారాణిపేట: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న వివిధ రకాల సర్వేలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం గ్రామ, వార్డు సచివాలయాల కీలక కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మిస్సింగ్ హౌస్ హోల్డ్ డేటా, ఎంఎస్‌ఎంఈ సర్వే, వర్క్ ఫ్రం హోమ్, హౌస్ ఇమేజ్, జియో కో–ఆర్డినేట్లు, తోలు కళాకారుల సర్వేలపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఆధార్ లేని పిల్లలను గుర్తించాలని, పెండింగ్‌లో ఉన్న సర్వే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో సర్వేను ధ్రువీకరించాలని ఆదేశించారు. సమావేశానికి డీఎల్డీవో ఉషారాణి, జోనల్ కమిషనర్లు హాజరయ్యారు. వర్చువల్‌గా ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment