పట్టించుకోని అటవీ శాఖాధికారులు
జనావాసంలోకి కణుజు
కొమ్మాది: కంబాల కొండ నుంచి దారి తప్పి ఓ కణుజు జనావాసాల్లోకి వచ్చేసింది. రాత్రి సమయంలో జాతీయ రహదారి దాటుకుని ఎండాడ పోలమాంబ ఆలయ ప్రాంతంలోకి చేరు కుంది. మూడు రోజుల నుంచి ఆహారం, తాగునీరు లేక ఎండ వేడికి తట్టుకోలేక.. జన సంచారానికి భయపడి బిక్కుబిక్కుమంటూ సంచరిస్తోంది. కాగా.. కణుజును తీసుకుని వెళ్లమని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తే.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment