కల్లుగీత కులాలకు వైన్‌షాపుల కేటాయింపు
విశాఖ సిటీ: కల్లుగీత కులాలకు వైన్‌షాప్‌ల లాటరీ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో సాయంత్రం 4 గంటలకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా లాటరీ తీసి షాపులను కేటాయించారు. జిల్లాలో మొత్తం 14 షాపులకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న 11 షాపుల్లో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, శెట్టిబలిజకు తొమ్మిది, ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు కేటాయించారు. వీరిలో కొందరు రెండు, మూడు దరఖాస్తులు చేశారు. మొత్తంగా 121 మంది 14 షాపుల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జీవీఎంసీ పరిధిలో ఒక షాపు కోసం మొత్తం 35 దరఖాస్తులు రావడం గమనార్హం. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.6.32 కోట్లు ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ లాటరీ తీసి షాపులు పొందిన వారి పేర్లను ప్రకటించారు. షాపులు దక్కించుకున్న 14 మంది తొలి వాయిదా కింద మొత్తంగా రూ.94,16,750 చెల్లించారు. వీరికి ప్రొవిజినల్ లైసెన్సులు మంజూరు చేశారు. ఈ లాటరీ ప్రక్రియలో ప్రొహిబిషనల్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment