
సమర్థంగా పీ4 సర్వే
మహారాణిపేట: పీ4 సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించి, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్‌ను ఆదేశించారు. పోర్టు గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పీ4 సర్వే నిర్వహించాలన్నారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా సిటిజెన్ సర్వీసెస్ అమలు చేసి.. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతలపై సీపీతో చర్చించి.. మెరుగైన సేవలందించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
కలెక్టర్‌కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment