
నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయి. ప్రైవేట్ లేఅవుట్లకు సంబంధించి ప్లాట్ల విషయంలో ఎక్కువగా ఫిర్యాదులు రాగా.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. అలాగే మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని త్వరలో పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ కె.రమేష్, ప్రధాన అర్బన్ ప్లానర్ శిల్ప, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, కార్యదర్శి మురళీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment