మొన్న దుబాయ్ విమానం
విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, స్లాట్‌లపై నౌకాదళ ఆంక్షలు.. మొదలైన కారణాలన్నీ ఎయిర్‌పోర్టుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో విభాగాలలో అపారమైన వృద్ధి సామర్థ్యం విశాఖకు ఉన్నా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం మానేసింది. దీంతో కొత్త సర్వీసులు గగనమైపోతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నడిపించేందుకు వైజాగ్ బెస్ట్ డెస్టినేషన్‌గా విమానయాన సంస్థలు భావిస్తుంటాయి. ఇటీవల మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎమిరేట్స్.. ఏపీ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నిర్వహించేందుకు సిద్ధమైన తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్వీసుని విజయవాడ నుంచి నడపాలని ఒత్తిడి తీసుకొచ్చింది. దీని వెనుక మంత్రి రామ్మోహన్‌నాయుడు చక్రం తిప్పడంతో.. ఇష్టం లేకపోయినా ఎమిరేట్స్ సంస్థ.. దుబాయ్ సర్వీసును విజయవాడ నుంచి ప్రారంభించేసింది.
Comments
Please login to add a commentAdd a comment