● వీఎంఆర్డీఏ పార్కుకు నూతన శోభ
చాపల్లో గంజాయి రవాణా
తాటిచెట్లపాలెం: గంజాయి రవాణాకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా చాపల్లో చుట్టి గంజాయిని రవాణా చేస్తుండగా విశాఖపట్నం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. 8వ నంబర్ ప్లాట్‌ఫాంపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాన్‌సింగ్ ఘోష్, కృష్ణపాల్‌లను తనిఖీ చేయగా.. వారి వద్ద గంజాయి లభించింది. వారు ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ చాపల్లో గంజాయిని కట్టలుగా కట్టి తీసుకువెళ్తున్నారు. ఒడిశాలోని పాడువా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు గంజాయిని రవాణా చేస్తుండగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి రూ.89,500 విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరినీ జీఆర్పీ ఎస్‌ఐ అబ్దుల్ మారూఫ్‌కు అప్పగించారు. పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
విశాఖ–బెంగళూరు స్పెషల్‌కు జోలర్‌పేట్‌లో హాల్ట్
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలుకు జోలర్‌పేట్‌లో అదనపు హాల్ట్ కల్పిస్తున్నట్లు సందీప్ తెలిపారు.
● విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు(08549) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 16 నుంచి, తిరుగు ప్రయాణంలో బయల్దేరే ఎస్‌ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08550) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు 17 నుంచి జోలర్‌పేట్‌లో హాల్ట్ కల్పించారు.
విశాఖ రైల్వే స్టేషన్‌లో నిందితుల అరెస్ట్
జీవీఎంసీ అధికారులతోస్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
● వీఎంఆర్డీఏ పార్కుకు నూతన శోభ
● వీఎంఆర్డీఏ పార్కుకు నూతన శోభ
● వీఎంఆర్డీఏ పార్కుకు నూతన శోభ
Comments
Please login to add a commentAdd a comment