తాజాగా వియత్నాం సర్వీసు
తాజాగా వియత్నాం సర్వీసు కూడా వెళ్లిపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో వైజాగ్‌లో జరిగిన వియత్నాం టూరిజం కాంక్లేవ్‌లో ఆ దేశ రాయబారి ఇక్కడి నుంచి వియత్నాంలోని ప్రధాన నగరం హొచిమిన్ సిటీకి 2025లో సర్వీసు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎయిర్‌ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధుల కృషితో కొత్త సర్వీసు రాబోతోందని అంతా భావించారు. అయితే మరోసారి వియట్‌జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, వైజాగ్ ఎయిర్‌పోర్టు అధికారుల్ని అసోసియేషన్ కోరింది. అయినా స్పందించకపోవడంతో వియట్‌జెట్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టుతో సంప్రదింపులు జరిపింది. దీంతో వియర్‌జెట్ సర్వీసుతో పాటు.. వియత్నాం గవర్న్‌మెంట్ ఎయిర్‌లైన్స్ సర్వీసు కూడా హైదరాబాద్‌కు తరలిపోయింది. ఫలితంగా రెండు నెలల కాలంలో రెండు విదేశీ సర్వీసులు వైజాగ్‌కు రాకుండా పోయాయి. దీనంతటికీ కేంద్ర మంత్రి నిర్లక్ష్యం, కూటమి సర్కారు వివక్షే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment