దివ్యాంగుల స్కూల్‌కు నాట్స్ ఆర్థికసాయం
ఎంవీపీ కాలనీ: జీవీఎంసీ 17వ వార్డులోని సన్‌ఫ్లవర్ దివ్యాంగుల స్కూల్‌కు నార్త్ అమెరికా తెలుగు సంఘం(నాట్స్) రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందజేసింది. నాట్స్ ప్రతినిధులు సోమవారం స్కూల్ యాజమాన్యానికి సంబంధిత చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాట్స్ సమన్వయకర్త వెంకన్న చౌదరి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు మాట్లాడుతూ భాషే రమ్యం– సేవే మార్గం నినాదంతో నాట్స్ మాతృభూమి రుణం తీర్చుకోవడానికి విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా సన్‌ప్లవర్ దివ్యాంగుల స్కూల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించేందుకు రూ.10 లక్షలు, నాట్స్ పూర్వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఎవోలైటెజ్ వ్యవస్థాపకుడు(విశాఖ) శ్రీనివాస్ అరసాడ మరో రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో నాట్స్ కన్వెన్షన్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment