మండు టెండలో.. చంటి బిడ్డలతో..
పేదలు గూడు కోసం ఎంత పరితపిస్తున్నారో ఈ చిత్రమే సాక్ష్యం. ఇల్లు లేని పేదలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా దరఖాస్తులతో బాధితులంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మండుటెండలో చంటి బిడ్డలతో తరలివచ్చారు. ఎండ అధికంగా ఉండడంతో ఓ తల్లి తన చంటిబిడ్డను కుమారుడి చేతిలో పెట్టి దరఖాస్తు అందజేయడానికి కార్యాలయం లోపలకు వెళ్లింది. ఆ ప్రాంగణంలో నీడ లేకపోవడంతో కార్యాలయం గోడ పక్కన.. కాలువ గట్ట్టుపై ఉన్న నీడలో
చిన్నారిని ఆడిస్తూ కనిపించాడు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
మండు టెండలో.. చంటి బిడ్డలతో..
Comments
Please login to add a commentAdd a comment