మరో విదేశీ విమానం పాయె
● ఇటీవల దుబాయ్ విమానం విజయవాడకు.. ● తాజాగా వియత్నాం విమానం హైదరాబాద్‌కు తరలింపు ● పట్టించుకోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ● వైజాగ్ నుంచి సర్వీసులకు ఆసక్తి చూపిస్తున్న ఆకాశా ఎయిర్‌లైన్స్ ● స్పందించని కేంద్ర మంత్రి, ఎయిర్‌పోర్టు అధికారులు
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయ విమాన సర్వీసులు విరివిగా నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కూటమి సర్కారు నిర్లక్ష్యం విశాఖ ఎయిర్‌పోర్టు పాలిట శాపంగా మారుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన వారే అయినా.. వస్తున్న విమాన సర్వీసులు కూడా ల్యాండ్ అవ్వకుండా టేకాఫ్ అయిపోతున్నాయి. ఇటీవల దుబాయ్ విమానాన్ని విశాఖ రానీయకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. ఇప్పుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్‌లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్‌పోర్టు వర్గాలు వ్యవహరిస్తున్నారు. విశాఖ నుంచి చక్కర్లు కొట్టేందుకు ఆకాశా ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉన్నా.. అధికారుల నుంచి ‘సిగ్నల్’ అందకపోవడంతో అది గాల్లోనే నిలిచిపోయింది.
మేం వస్తామన్నా.. పట్టించుకోరా.?
విదేశీ సర్వీసుల పరిస్థితి ఇలా ఉంటే.. డొమెస్టిక్ సర్వీసుల పెంపుపైనా అదే వైఖరి కనిపిస్తోంది. ప్రముఖ ఎయిర్‌లైన్స్ ఆకాశా సంస్థ.. వైజాగ్ నుంచి హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాలకు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు వైజాగ్ ఎయిర్‌పోర్టు అధికారులకు నెల రోజుల క్రితమే సమాచారం పంపించింది. అయినా ఎవరూ స్పందించకపోవడంతో ఆకాశా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరో విదేశీ విమానం పాయె
Comments
Please login to add a commentAdd a comment