ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లు
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
ఎంవీపీకాలనీ : రాష్ట్ర స్థాయి పోటీలకు విశాఖ జిల్లా బాలురు, బాలికలు జట్లను ఎంపిక చేసినట్లు విశాఖ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాదరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని వైఎస్సార్ ఇంటిగ్రేడ్ స్పోర్ట్స్ అకాడమిలో జరగనున్న 34వ రాష్ట్ర సబ్ జూనియర్ బాలురు, బాలికల కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో విశాఖ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గత వారం రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాలురు, బాలికల జట్లుకు శిక్షణ అందించినట్లు తెలిపారు. బాలురు జట్టుకు మేనేజర్‌గా ఎం.శివ, కోచ్‌గా కె.జయ వ్యవహరించనుండగా ప్రదీప్, దుర్గాప్రసాద్, శ్రీను, సంపత్, సందీప్, ప్రసాద్, మణికంఠ, కార్తీక్, హేమంత్, హేమసతీష్, శ్రీను, హేమసుందర్ సభ్యులుగా ఎంపికై నట్లు పేర్కొన్నారు. మహిళల జట్టుకు కోచ్‌గా చైతన్య వ్యవహరిస్తుండగా ద్రాక్ష, మేఘన, పుణ్యమ, జానకి, కుసుమ, ప్రణీత, హరిక, అనురాధ, సౌమ్య, అక్షయ, కావ్య, పావని ఎంపికై నట్లు వెల్లడించారు. ఎంపికై న ఆయా జట్ల క్రీడాకారులకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డితో పాటు జాయింట్ సెక్రటరీ సిహెచ్ గోవిందు, కోశాధికారిగా లక్ష్మణరావు, జాతీయ క్రీడాకారులు వై.వి.శ్రీనివాస్, వి.కనకరాజు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment