భూసేకరణ ప్రక్రియ వేగవంతం
అధికారులకు కలెక్టర్ ఆదేశం
మహారాణిపేట: జిల్లాలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిర్దేశించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ కె.మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్‌తో కలిసి శనివారం పలు ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టనున్న రైల్వే, హెచ్‌పీసీఎల్, ఇరిగేషన్, విద్యుత్, ఐవోసీఎల్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లు తదితర ప్రాజెక్ట్‌లకు నిర్ణీత కాలంలో అవసరమైన భూములను సేకరించి, నివేదిక అందేజేయాలని ఆదేశించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment