
మెట్లు కూలి మహిళా కూలీ మృతి
ఐఏఎస్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా శ్రీధర్
విశాఖ సిటీ: ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ(ఐఏఎస్) గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా తొలిసారిగా తెలుగువారైన డాక్టర్ శ్రీధర్ గంగవరపు ఎన్నికయ్యారు. మెడికవర్ ఆస్పత్రిలో ఆర్థ్రోస్కోపీ కీ హోల్ స్టెషలిస్ట్ అయినా శ్రీధర్ 2025 నుంచి 2027 వరకు ఐఏఎస్ సభ్యుడిగా కొనసాగనున్నారు. ఐఏఎస్ ఎన్నికల్లో తొలిసారిగా తెలుగు వ్యక్తి గెలవడం రాష్ట్రానికి గర్వకారణమని మెడికవర్ ముఖ్య అధికారులు, వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.
పీఎంపాలెం: నిర్మాణంలో ఉన్న భవనం మెట్లు కూలిపోయిన ఘటనలో మహిళా కూలీ సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 8వ వార్డు పరిధి పనోరమ హిల్స్ వద్ద ఐకానికా గ్రాండ్ విల్లా నంబరు 121 నిర్మాణంలో ఉంది. ఈ భవనం మెట్ల నిర్మాణ లోపం కారణంగా రెండవ అంతస్తు నుంచి కూలిపోయి.. అదే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో పని చేస్తున్న మహిళా కూలీ నీలరోతు రామలక్ష్మిపై పడ్డాయి. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం వేముల గ్రామానికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ఘటనలో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చౌడంతవలస గ్రామానికి చెందిన టి.ఆదినారాయణ వెన్నుపూస దెబ్బతింది. భీమిలి చేపలుప్పాడకు చెందిన కోడా అమ్మాజమ్మ కాలు విరిగి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాయత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇద్దరికి గాయాలు