
చందనోత్సవం సీఎఫ్‌వోగా భ్రమరాంబ
సింహాచలం : సింహగిరిపై వచ్చే నెల 30న జరిగే చందనోత్సవానికి దేవదాయశాఖ తరపున చీఫ్ ఫెస్టివల్ అధికారిగా ఆ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దర్భముళ్ల భ్రమరాంబ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం దేవదాయశాఖ ప్రధానకార్యాలయం అడిషనల్ కమిషనర్ టి.చంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమరావతిలో దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్‌జేసీగా ఉన్న నిర్వర్తిస్తున్న భ్రమరాంబ మూడుసార్లు సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవోగాను, 2022 చందనోత్సవంలో చీఫ్ ఫెస్టివల్ అఽధికారిగా విధులు నిర్వర్తించారు.