ఎకై ్సజ్ కానిస్టేబుళ్ల సంఘం నూతన కార్యవర్గం
పెందుర్తి: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రోహిబిషన్, ఎకై ్సజ్ శాఖ కానిస్టేబుల్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని ఓ పంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా కె.అప్పలనారాయణ, గౌరవ అధ్యక్షుడిగా కె.వి.ఎం రాజు, ఉపాధ్యక్షుడిగా డి.రవితేజ, ప్రధాన కార్యదర్శిగా ఆర్.జగన్నాథ, ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంఘం కృషి చేస్తుందని అధ్యక్షుడు అప్పలనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment