
పెరుమాళి పీఏసీఎస్‌లో దర్యాప్తు
తెర్లాం: మండలంలోని పెరుమాళి పీఏసీఎస్‌లో అవకతవకలు జరిగాయని శివరామరాజు అనే వ్యక్తి ఇటీవల కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై శనివారం దర్యాప్తు నిర్వహించారు. బొబ్బిలి సబ్ డివిజనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారి చల్లా పద్మజ పీఏసీఎస్‌కు వచ్చి ఫిర్యాదుదారు, పీఏసీఎస్ అధికారులు, కమిటీ సభ్యుల సమక్షంలో దర్యాప్తు చేశారు. పీఏసీఎస్‌లో రైతులకు తెలియకుండా రుణాలు మంజూరు చేస్తున్నారని, నచ్చిన వారిని ఎటువంటి జీవోలు లేకుండా ఉద్యోగులుగా నియమించుకుని వేలాది రూపాయలు జీతాలుగా తీసుకుంటున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు. పెరుమాళి పీఏసీఎస్ పరిధిలో డీసీసీబీ నిధులతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని, ఆ బంక్‌లో కూడా అక్రమాలు జరుగుతున్నాయని కొరగంజి అశోక్ దర్యాప్తు అధికారి వద్ద తెలిపారు. దీనిపై దర్యాప్తు అధికారి పద్మజ మాట్లాడుతూ పెరుమాళి పీఏసీఎస్‌లో జరిగిన దర్యాప్తులో ఫిర్యాదుదారులు తెలిపిన వివరాలు, సభ్యులు లెవనెత్తిన అంశాలను, సూపర్‌వైజర్, మేనేజర్ దర్యాప్తుకు హాజరుకాని విషయంపై నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తానని చెప్పారు. దర్యాప్తులో పీఏసీఎస్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.