
పేరుకు స్మార్ట్ సిటీ.. కానీ పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం. అందుకేనేమో.. ఇటీవల పారిశుద్ధ్య విభాగంలో ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డ్స్–2022లో వరంగల్ నగరం అడ్రస్ గల్లంతైంది. పారిశుద్ధ్య విభాగంలో చేపట్టిన సంస్కరణల్లో నగరం ఫెయిల్ కావడంతో అవార్డు దక్కకుండా పోయింది.
ఇందుకు నిదర్శనమే ఇలాంటి దృశ్యాలు. వరంగల్ రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద మురుగు నీరు రోజుల తరబడి నిలిచి తీవ్ర దుర్గంధం వెలువడుతూ దోమలు, ఈగలు, పందులకు ఆవాసంగా మారింది. కమిషనర్ గారూ దీనివైపు కూడా ఒకసారి చూడండి అంటూ నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
– సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, వరంగల్