అలరించిన నాటికల ప్రదర్శన
వర్ధన్నపేట: వర్ధన్నపేటలోని భారతీయ నాటక కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటికల పోటీలు రెండో రోజు ఆదివారం ప్రేక్షకులను అలరించాయి. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ వారి ‘వీడేం మగాడండీ బాబు’ హాస్యనాటిక ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. నటులు తమ హాస్యంతో నాటికను రక్తి కట్టించారు.
చిలుకలూరిపేట వారి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’
ది అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్ చిలుకలూరి పేట వారి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నాటికను రాత్రి 10 గంటలకు ప్రదర్శించారు. ‘ప్రతిమనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని నాటికలోని సారాంశం. నచ్చిన పనిలో మమేకమైనప్పుడు అది మొగ్గ తొడిగి వెల్లివిరుస్తుంది. ఆ ప్రతిభే మరోసారి చిక్కుల్లోకి నెట్టి పరీక్షిస్తుంది. ఆ చిక్కులను అధిగమించి అప్రతిహతంగా దూసుకుపోయేవాడే విశ్వాన్ని సైతం ఒడిసిపట్టగలడు. అనుకున్నది సాధించగలడు’ అనే ఇతివృత్తంతో నాటికను ప్రదర్శించారు.
అలరించిన నాటికల ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment