సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
– 8లోu
ఎల్కతుర్తి: మండల పరిధి సూరారం శివారు సింగరాయ విశ్వేశ్వరాలయం మహా శివరాత్రి ఉత్సవాల కు ముస్తాబవుతోంది. సింగరాయ విశ్వేశ్వరాలయం సుమారు 1,500 ఏళ్ల క్రితం నిర్మించినట్లు చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. జీర్ణావస్థలో ఉన్న ఆలయానికి మరమ్మతులు చేపట్టి సింగరాయ విశ్వేశ్వరుడిని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ శివుడిని కోరుకుంటే కోరికలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం. ప్రతీ మహాశివరాత్రి పర్వదినాన పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఈనెల 26న శివరాత్రి సందర్భంగా కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నా రు. ప్రతి మహా శివరాత్రి రోజు శివ కల్యాణాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలతోపాటు హైదరాబాద్, షొలాపూర్, ఏటూరునాగా రం నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని గ్రామస్తులు చెబుతున్నారు.
న్యూస్‌రీల్
భక్తుల కొంగు బంగారం
భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ఇక్కడి విశ్వేశ్వరుడి ఆలయం సంతాన విశ్వేశ్వరాలయంగా పేరుగాంచింది. ఆలయ సింహద్వారం దక్షిణం వైపు ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రముఖ ఆలయాల్లో ఇదొకటిగా ఈ ప్రాంత భక్తులు భావిస్తారు. ఆలయ ప్రాంగణంలోని దీప ధ్వజస్తంభం ఆగ్నేయ దిశలో 50 మీటర్ల ఎత్తున ఉంది. దీనిపై వెలిగే దీపం కనుచూపు మేర దర్శిస్తుంది. ఆ ప్రాంతమంతా పరమేశ్వరుడి కరుణతో నిండిపోయి పంటపొలాలు పచ్చదనంతో నిండుగా ఉంటాయని భక్తుల నమ్మకం. గర్భగుడికి ఎదురుగా మండపం, ముందు పురాతన బావి ఉంటుంది. ఈ బావిలోని నీరు అన్ని కాలాల్లోనూ స్వచ్ఛతగా చెతికందేంత ఎత్తులో ఉంటాయి.
సోమవారం శ్రీ 24 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment