అర్హత పరీక్షకు 98 శాతం హాజరు
విద్యారణ్యపురి: సాంఘిక సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 98శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 5వ తరగతిలో ప్రవేశం, 6, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి హనుమకొండ జిల్లాలో ఆదివారం ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు. 16 సెంటర్లలో 4,470 మందికి గాను 4,347(98శాతం) విద్యార్థులు పరీక్ష రాసినట్లు జిల్లా నోడల్ అధికారి, మడికొండ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సి పాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. ఆమె మడికొండ, పరకాల సెంటర్లను సందర్శించి పరీక్ష నిర్వహిస్తున్న తీరును పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment