గోఆధారిత ఉత్పత్తులను ఆదరిద్దాం
హన్మకొండ చౌరస్తా: తల్లిపాల లాంటి స్వచ్ఛమైన గోఆధారిత సేంద్రియ ఎరువులతో పండించిన ఉ త్పత్తులను ఆదరిద్దామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ చౌరస్తా పింజర్లవీధిలోని శ్రీరాజరాజనరేంద్ర భాషా నిలయంలో గ్రామ భారతి ప్రకృతి జీవన వికాస సంస్థ ఆధ్వర్యా న ఏర్పాటు చేసిన గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆ దివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్న నేటి కాలంలో సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తులను నగర ప్రజల కు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీ యమని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, నిర్వాహకులు ఆకుతోట రామారావు, చిన్నల అనిత, సారయ్య, సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment