కళాకారులను ప్రోత్సహించాలి
● బుల్లితెర నటుడు సుబ్బరాయశర్మ
హన్మకొండ కల్చరల్: నాటక కళాకారులను ప్రోత్సహించాలని ప్రముఖ సినీ, బుల్లితెర నటుడు సుబ్బ రాయశర్మ అన్నారు. వరంగల్ సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యాన తెలుగుభాష ఆహ్వా న నాటక పోటీలు ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు నేతృత్వంలో జరిగిన ఈ పోటీలను సుబ్బరాయశర్మ ప్రారంభించి మాట్లాడారు. నాటక ప్రదర్శనల్లో భాగంగా బీఎం.రెడ్డి దర్శకత్వం వహించిన హైదరాబాద్‌కు చెందిన విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ ‘స్వేచ్ఛ’, ఉప్పులూరు సుబ్బ రాయశర్మ దర్శకత్వంలో హైదరాబాద్‌కు చెందిన మహతి క్రియేషన్స్ ‘ఉక్కు సంకెళ్లు’ అలరించాయి. కార్యక్రమంలో సంస్థ బాధ్యులు కుందావజ్జుల కృష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతారావు, ప్రాయోజకులు పాలాయి శరత్, కల్యాణ్, సంతోష్ కుమార్‌తో పాటు భాస్కర్‌రావు, ఎన్వీఎన్.చారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment