పంటలకు సమృద్ధిగా నీరందించాలి
రాయపర్తి: ఎస్సారెస్పీ డీబీఎం–54, 57 కాల్వల ద్వారా యాసంగి పంటలకు సమృద్ధిగా నీరందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్, ఊకల్, గట్టికల్, జగన్నాథపల్లి గ్రామాల్లో మంగళవారం అధికారులతో కలిసి పంటలకు సాగునీరందుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సందర్శించి నీటి నిల్వ సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికి వచ్చేవరకు నీరందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఇరిగేషన్ ఈఈ రమేశ్‌బాబు, డీఈ కిరణ్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment