పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గీసుకొండ: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వఽ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 15,16 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కొనాయమాకుల రైతువేదికలో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీఓ ఆడెపు ప్రభాకర్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment