ఆయకట్టుకు నీరందించేందుకు కృషి
పర్వతగిరి: మండల కేంద్రంలోని రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు నీరందించేందుకు కృషిచేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఎమ్మెల్యే మంగళవారం అధికారులతో కలిసి రిజర్వాయర్‌ను సందర్శించారు. పంట పొలాలకు నీరందించకుండా జాప్యం చేస్తున్న అధికారులను మందలించారు. సంబంధిత ఉన్నతాధికారులు, కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి నీళ్లందించేలా కృషి చేయాలని కోరారు. టీపీసీసీ లీగల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment