
సమాజ మార్గదర్శకుడు పూలే
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
రామన్నపేట : సమాజంలోని రుగ్మతలను పారదో లడానికి ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే అని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, విద్య విషయంలో పూలే దంపతులు చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ‘కుడా’ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓలు రాథోడ్ ర మేశ్, సత్యపాల్ రెడ్డి, హనుమకొండ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్‌రెడ్డి తదితరులున్నారు.