ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెయ్యేరు అలేఖ్య కాలనీలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగోదావరిజిల్లా గొల్లప్రోలుకు చెందిన మమ్మిడివరపు రాంబాబు, సంతోషిణి(26) దంపతులు. వీరు ఉపాధి నిమిత్తం పెయ్యేరులో కొంతకాలంగా నివాసముంటున్నారు. రాంబాబు చేపల చెరువుపై గుమస్తాగా పనిచేస్తుంటాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. బుధవారం ఉదయమే రాంబాబు విధుల నిమిత్తం బయటకు వెళ్లిపోగా కొద్దిసేపటికి సంతోషిణి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేళాడుతుండడం పిల్లలు గమనించి కేకలు వేశారు. స్థానికులు వచ్చి పరిశీలించి ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ జేఎస్ సుభానీ, ఎస్సై వీరభద్రరరావు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. సంతోషిణి బంధువు సింహాద్రి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంతోషిణి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment