
చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
వీరవాసరం: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్ర భుత్వం నెరవేర్చకుండా ప్రజలందరినీ మోసం చేస్తోందని, సీఎం చంద్ర బాబు బహిరంగ క్షమా పణ చెప్పాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం నవుడూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన పార్టీ ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే అన్నారు. అభివృద్ధి, సంక్షేమం బండికి రెండు చక్రాల మాదిరిగా సు పరిపాలన అందించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. నాడు–నేడు పేరుతో పాఠశాల లు, ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల వల్ల రాష్ట్రానికి భారీగా మిగులు నిధులు ఏర్పడటానికి మాజీ సీఎం జగన్ కారణమని స్పెషల్ కమిటీ పేర్కొనడం గమనార్హం అన్నారు. ఎన్నికల ముందు అసత్య ఆరోపణలతో చంద్రబా బు గద్దెనెక్కారని, అధికారం కోల్పోయినా ప్రజ ల గుండెల్లో జగన్ నిలిచిపోయారని అన్నారు. జగన్ ఏ కార్యక్రమానికి వెళ్లినా తండోపతండాలుగా వస్తున్న ప్రజాభిమానమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ శ్రీనివాస్ అన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్త అక్రమ అరెస్ట్
ఉండి: మండలంలోని కలిగొట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త దాసరి కిశోర్‌బాబును పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా అరెస్టు చేశారు. కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 10 నెలల క్రితం కలిగొట్లలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు యశోద కృష్ణపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేయగా అప్పట్లో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ఆదివారం తాను యశోద కృష్ణను చంపుతానని, గతంలో కూడా చంపేందుకు ప్రయ త్నించింది తానేనని అన్నట్టు ఓ నంబర్ నుంచి యశోదకృష్ణకు ఎవరో వాట్సాప్ మెసేజ్ పె ట్టారని కిశోర్‌బాబు అన్నారు. అసలు ఆ ఫోన్ నంబర్ తనది కాదని, ట్రూకాలర్‌లో తన పేరు, తన ఫొటో వచ్చేలా చేసి కేసులో తనను, తన బంధువులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కిశోర్‌బాబు వాపోయారు. తాను జగన్ అభిమానినని కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను యశోద కృష్ణను బెదిరించలేదని కిశోర్‌బాబు తెలిపారు.
భళా.. చికెన్ మేళా
ఏలూరు (టూటౌన్): బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చికెన్, గుడ్లు తినడంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు పౌల్ట్రీ యాజమాన్యం, చికెన్ వ్యాపారులు సంయుక్తంగా స్థానిక ఏఎస్‌ఆర్ స్టేడియంలో ఆదివారం చికెన్ మేళా నిర్వహించారు. పలురకాల చికెన్ వంటకాలను వండి వ డ్డించారు. మేళాకు స్పందన బాగుండటంపై ని ర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో బర్డ్‌ఫ్లూ వచ్చిన ప్రాంతంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నివారణా చర్యలు తీసుకున్నారని, ఆయా ప్రాంతాల్లో కోళ్లను ఖననం చేసి గుడ్లను పూడ్చిపెట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉడికించిన చికెన్, గుడ్లలో బర్డ్‌ఫ్లూ అవశేషాలు ఉండవని, నిర్భయంగా చికెన్, గుడ్లను తినవచ్చని అవగాహన కల్పించారు. పశుసంవర్ధకశాఖ ఇన్‌చార్జి జేడీ టి.గోవిందరాజు, జీబీఆర్ హేచరీస్ ఎండీ జి.సుబ్బారావు, బొబ్బా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
మిర్చి ధరలపై ప్రభుత్వ వైఖరితో నష్టం
ఏలూరు (టూటౌన్): మిర్చి ధరలు తగ్గి రైతు లు తీవ్ర ఆందోళన చెందుతుంటే క్వింటాల్‌కు రూ.11,600 ధరను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదన చేయడం, కేంద్రం కేవ లం రూ.11,781 ధర నిర్ణయించడం రైతులకు ఏమాత్రం ప్రయోజనకరం కాదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ మిర్చి క్వింటాల్‌కు రూ.20 వేల నుంచి రూ.25 వేలకు తక్కువ కా కుండా ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మిర్చి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అ నుమతులు పొందాలన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ధరల వ్యత్యాసం నుంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చితో పాటు పత్తి, కోకో, అపరాలు ధరలు తగ్గడంతో రైతులు భారీగా నష్టపోతున్నారన్నా రు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలను తక్షణమే రైతులకు అందించాలని కోరారు.

చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
Comments
Please login to add a commentAdd a comment