
మధ్యాహ్న భోజనంలో మార్పులు
నిడమర్రు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో సోమవారం నుంచి జోన్ల వారీగా మెనూ అమలు చేయనున్నారు. కొత్త మెనూను ఏప్రిల్ 23 వరకు ట్రయల్‌రన్ నిర్వహించనున్నారు. చివరిలో అభిప్రాయాలు సేకరించి మార్పులపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. ప్రాంతాల వారీగా ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో నాలుగు జోన్లగా నిర్ధారించారు. జోన్–2లో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. ఈ మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జోన్–2 పరిధిలోకి వచ్చాయి.
జోన్–2 కొత్త మెనూ
● సోమవారం.. అన్నం, కూరగాయలు లేదా ఆకుకూర పప్పు, ఫ్రై చేసిన గుడ్డు, బెల్లం చిక్కీ.
● మంగళవారం.. పులిహోరా, ఉడికించిన గుడ్డు, చట్నీ, రాగిజావ.
● బుధవారం.. అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, ఫ్రై చేసిన గుడ్డు, బెల్లం చిక్కీ.
● గురువారం.. కూరగాయల అన్నం లేదా వెజ్ పలావు, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ.
● శుక్రవారం.. అన్నం, ఆకుకూర పప్పు, ఫ్రై చేసిన గుడ్డు, బెల్లం చిక్కీ.
● శనివారం.. అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, స్వీట్ పొంగలి, రాగిజావ
నిర్వహణ ఖర్చులు పెంచలేదు
జోన్–2 మెనూలో సాంబారు, పప్పు చారు లేవు. ఇప్పటివరకు అమలు చేసిన మెనూ ప్రకారం గురువారం సాంబారు, శనివారం పప్పు చారును వడ్డిస్తున్నారు. అధికారులు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా నిర్వహణ ఖర్చులపై శ్రద్ధ పెట్టాలని ఎండీఎం నిర్వహణ ఏజెన్సీ సభ్యులు కోరుతున్నారు. నిర్వాహకులకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఖర్చుల నిమిత్తం 1 నుంచి 5వ తరగతి విద్యార్థికి రూ.5.13 పైసలు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థికి రూ.8.57 పైసలు ప్రభుత్వం అందిస్తోంది.
ఇకపై జోన్ల వారీగా అమలు
నేటి నుంచి కొత్త మెనూ
ఏప్రిల్ 23 వరకు ట్రయల్‌రన్
Comments
Please login to add a commentAdd a comment