
ప్రశాంతంగా గ్రూప్–2
ఏలూరు(మెట్రో) : ఏలూరులో గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఆదివారం ఏలూరులోని 6 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులకు రవాణా సౌకర్యంతో పాటు కేంద్రాలకు సరైన సమయంలో చేరుకునేలా లైజన్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి కో–ఆర్డినేషన్ అధికారిగా వ్యవహరించారు. మూడు కేంద్రాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించారు. ఉదయం సెషన్‌లో 4,415 మంది అభ్యర్థులకు 3,881 మంది (87.90 శాతం), మధ్యాహ్న సెషన్‌లో 4,415 మందికి 3,878 మంది (87.81 శాతం) హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 534 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 537 మంది అభ్యర్థు లు పరీక్షలకు గైర్హాజరయ్యారు.
సెంటర్ల వారీగా హాజరు
సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో 2,210 మందికి 1,925 మంది, సీఆర్‌రెడ్డి పాలిటెక్నికల్ కళాశాలలో 480 మందికి 430 మంది, సీఆర్ రెడ్డి డిగ్రీ అటానమస్ కాలేజీలో 480 మందికి 439 మంది, సీఆర్‌రెడ్డి మహిళా కళాశాలలో 480 మందికి 431 మంది, ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 480 మందికి 423 మంది, సెయింట్ థెరిస్సా మహిళా కళాశాలలో 285 మందికి 233 మంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment