
ఇచ్చిన మాటకు కట్టుబడే నేత జగన్
తణుకు అర్బన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో కూడిన వ్యక్తి అని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అబద్ధపు హామీలు ఇవ్వకపోవడమో, ఈవీఎంల మహిమతోనో ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆదివారం తేతలిలో పార్టీ నాయకులు భూపతిరాజు రామకృష్ణరాజు నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, జగన్ అంటే ఏంటో, చంద్రబాబు ఏంటో అనే విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలు అమలుచేయకపోవడాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని, అందుకే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేక దాక్కుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉంటారని, ప్రజాసమస్యలపై పోరాటంతోపాటు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు. అనంతరం తేతలిలో నిర్వహిస్తున్న పూజాదికాల్లో కారుమూరి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, నాయకులు కోట స్వామీజీ, సరెళ్ల వీరతాత, నడింపల్లి రాజ్యంరాజు, భూ పతిరాజు బాలకృష్ణంరాజు, భూపతిరాజు నేతాజీ, తేతలి సీతారాం సుబ్రహ్మణ్యం, దారం శ్రీను, మానేపల్లి సంపతరావు, మానేపల్లి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment