భీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలుపై విద్యుత్తు శాఖ అధికారులు, బ్యాంకర్లుతో కలెక్టరు చదలవాడ నాగరాణి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 13,610 దరఖాస్తులు రిజిస్టరు కాగా 662 ఇళ్లకు మాత్రమే సోలార్ ప్యానల్స్ పెట్టారని చెప్పారు. సోలార్ ప్యానల్ వల్ల లాభాల గురించి మరింత అవగాహన కల్పించేలా అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఫలితాలు సాధించడంలో అధికారులు అలసత్వంగా ఉన్నారన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, విద్యుత్తు శాఖ అధికారి ఏ.రఘునాథ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment