
రైతులు దళారులను ఆశ్రయించొద్దు
పాలకొల్లు సెంట్రల్: రైతులు మద్దతు ధరకు ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించాలని, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం మండలంలోని శివదేవుని చిక్కాల రైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం లోడు ఎత్తిన తర్వాత కూడా తేమ శాతాన్ని లెక్కించాలని, మిల్లు వద్దకు వెళ్లినా తేడా రాకూడదన్నారు. ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత ఎఫ్‌టీఓ జనరేట్ చేయకపోతే సకాలంలో ధాన్యం సొమ్ములు జమకావన్నారు. రైతు లు నగదు కోసం మిల్లుల వద్దకు వెళ్లనవసరం లేదన్నారు. వ్యవసాయ శాఖ జేడీ జెడ్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్ దుర్గ కిషోర్, ఏడీఏ ఎ.పార్వతి, ఎంఏఓ రాజశేఖర్ ఉన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యో గుల ఉద్యోగ భద్రతా సర్క్యులర్‌ను అమలు చే యాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం డిపో గేట్ వద్ద నిరసన తెలిపారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్ ఆపాలని, ఆగిపోయిన ప్ర మోషన్స్ ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలని, అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు ఎంవీ రత్నం, జోనల్ ఉపాధ్యక్షు డు ఎ.నాగేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.భుజంగరావు, డిపో అధ్యక్షుడు ఎంఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సూత్రధారులను వదిలి పాత్రధారుల అరెస్టా?
కొయ్యలగూడెం: సూత్రధారులను వదిలి పా త్రధారులను అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం చట్టాన్ని పక్కదోవ పట్టిస్తోందని మాజీ ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవా రం వైఎస్సార్‌సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడు కిరణ్ వెనకున్న అసలు దోషులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. కిరణ్‌ని అరెస్టు చేసిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నా రు. జగన్‌ని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చే సుకుని అసత్యపు ఆరోపణలు చేస్తోందన్నారు. నిలకడ లేని రాజకీయాలకు పవన్ కల్యాణ్, నైతిక విలువలు లేని రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని అన్నారు. ఖాకీలు ఖద్దర్ చొక్కాల మాటున విధులు నిర్వహిస్తుండటం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు రుచి చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, టౌన్ కన్వీనర్ సంకు కొండ, ఎంపీటీసీ ఘంటసాల సీనమ్మ, నాయకులు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ కోర్సు ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. భౌతికశాస్త్రం పరీక్షకు 41 మందికి 35 మంది, రసాయన శాస్త్రం పరీక్షకు 41 మందికి 32 మంది హాజరయ్యారు. జిల్లాలో డీఈసీ కమిటీ ప్రయోగపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని, ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖా ధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

రైతులు దళారులను ఆశ్రయించొద్దు