
ఎస్‌ఆర్‌కేఆర్ ప్రోత్సాహంతో ఉన్నత స్థానం
ఉప రాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సుమ
భీమవరం: స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహమే తమ ఉన్నతికి కారణమని డీఏఎన్ ఐపీఎస్ అధికారిణి, ఢిల్లీ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్, భారత ఉపరాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ మద్ద సుమ అన్నారు. మంగళవారం తాను చదువుకున్న ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తన భర్త, కళాశాల పూర్వ విద్యార్థి, శ్యాంసంగ్ ఆర్‌అండ్‌డీ విభాగం జనరల్ మేనేజర్ బి అనిల్ కుమార్‌తో కలిసి వచ్చి ఈసీఈ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని సుఽమ స్పష్టం చేశారు. తన సోదరుడు ఎం నీలాజలం కూడా ఇక్కడే చదివి అనంతరం పీజీ చేసి పోటీ పరీక్షల్లో విజయం సాధించి భీమవరంలోనే ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కళాశాల డైరెక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ ఎన్ ఉదయ్ కుమార్, ఈసీఈ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి వారిని అభినందించారు.