
శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్య క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు, అందులోనూ ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు వెలువడటంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. భక్తులతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. వకుళమాత నిత్యాన్నదాన భవనం వద్ద ఉచిత అన్నప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. పార్కింగ్ ప్రదేశాలు భక్తుల వాహనాలతో నిండిపోయాయి. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.

శ్రీవారి క్షేత్రంలో పోటెత్తిన భక్తులు