
కంటి వెలుగు లేదు
గత ప్రభుత్వంలో పెద్దపీట
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కంటి పరీక్షలు కొనసాగించాలి
గతంలో ఆస్పత్రిలోని ఈఐ కేంద్రంలో, పాఠశాలలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి కంటి పరీక్షలు చేసేవారు. మందులు, కళ్లజోళ్లు ఇవ్వడంతో పాటు శస్త్రచికిత్సలు చేసేవారు. ఇలానే సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి.
– వర్ధనపు సుధాకర్, రుస్తుంబాద
పేదలకు ఇబ్బంది
ఈఐ కేంద్రాల్లో కంటి పరీక్షలు నిలిపివేయడంతో పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సేవలందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటంతో పరీక్షలకు చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి.
– కురెళ్ల పౌలు, దుంపగడప, ఆకివీడు మండలం
సాక్షి, భీమవరం: పేదల కంటి వైద్యానికి కూటమి ఎగనామం పెట్టింది. సీహెచ్‌సీల్లోని ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల కాంట్రాక్టు గడువు ముగిసి ఎనిమిది నెలలుగా సేవలు నిలిచినా పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అంతంతమాత్రంగానే ఉండటంతో పేదవర్గాలు కంటి పరీక్షల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
జిల్లాలోని ఐదు కేంద్రాల్లో..
జిల్లాలోని భీమవరం, ఆచంట, ఆకివీడు, పాలకొల్లు, నరసాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ల్లో ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా కంటి వైద్యసేవలు అందించే వారు. ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఒక ఆఫ్త్త మాలజీ అసిస్టెంట్, ఒక ఎక్యూప్మెంట్ అసిస్టెంట్ అందుబాటులో ఉండేవారు. ఆధునాతన ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, కంటి లోపల భాగాలను పరీక్షించే ఫండస్ కెమెరాలతో కంప్యూటర్ ద్వారా డీఆర్, గ్లకోమా, కాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్, హైపర్‌టెన్సీవ్ రెటీనోపతి తదితర సుమారు రూ.3 వేల విలువైన పరీక్షలు చేసేవారు. అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందించేవారు. కంటి సమస్యలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారిని తొలిదశలోనే గుర్తించి మెరుగైన వైద్య నిమిత్తం సమీపంలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులకు పంపేవారు.
8 నెలలుగా నిలిచిన సేవలు
కాంట్రాక్టు సంస్థతో ఉన్న మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ) గతేడాది సెప్టెంబరు 4తో ముగిసింది. సేవలను కొనసాగించే నిమిత్తం ఎంఓయూను రెన్యువల్ చేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ఈఐ కేంద్రాల సేవలు నిలిచిపోయాయి. ఆస్పత్రుల్లోని ఆటోమెటిక్ రిఫ్రాక్టర్ మీటర్, ఫండస్ కెమెరాలు, ఇతర సామగ్రిని అప్పట్లోనే కాంట్రాక్టు సంస్థ తరలించుకుపోయింది. ఈఐ కేంద్రాల గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ ఉచిత కంటి వైద్య పరీక్షల నిర్వహణపై కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
కూటమి చిన్నచూపు
8 నెలలుగా నిలిచిన ఈఐ కేంద్రం సేవలు
కాంట్రాక్టు సంస్థతో గత సెప్టెంబరులో ముగిసిన ఎంఓయూ
రెన్యువల్‌కు చొరవ చూపని కూటమి ప్రభుత్వం
కంటి వైద్య సేవల కోసంపేదల ఇబ్బందులు
గత ప్రభుత్వంలో జిల్లాలో 1,30,733 మందికి కంటి పరీక్షలు
90,059 మందికి కళ్లజోళ్ల పంపిణీ
గత ప్రభుత్వంలో ఈఐ కేంద్రాల్లో అందించిన సేవలు
ఈఐ కేంద్రం వైద్య పరీక్షలు రిఫ్రాక్షన్ చెక్స్ కళ్లజోళ్లు పంపిణీ ఫండస్ చెక్స్
ఆచంట 27,970 27,832 18,131 13,831
ఆకివీడు 20,576 20,407 13,688 7,246
భీమవరం 23,944 23,638 17,807 8,899
పాలకొల్లు 30,553 29,815 21,443 12,491
నరసాపురం 27,690 26,666 18,990 10,635
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. 2018లో ఏర్పాటైన ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల నిర్వహణతో పాటు వృద్ధులు, విద్యార్థుల కోసం గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్సార్ కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కేంద్రాల్లో సేవలకు ఆంటంకం కలగకుండా కాంట్రాక్టు సంస్థతో ఎంఓయూ గడువును ఎప్పటికప్పుడు రెన్యూవల్ చేస్తూ వచ్చారు. ఈఐ కేంద్రాల ద్వారా మొత్తంగా 1,30,733 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 1,28,358 మందికి రిఫ్రాక్షన్ చెక్స్, 53,102 మందికి ఫండస్ చెక్స్, 90,059 మందికి కళ్లజోళ్లు అందజేశారు. 884 డీఆర్, 626 గ్లకోమా, 140 మాక్యులర్ డిజనరేషన్, 14,080 కాటరాక్ట్, 76 హైపర్‌టెన్సివ్ రెటినోపతి రోగులను గుర్తించి సంబంధిత వైద్యసేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు సగటున వంద మందికి పైగా రోగులు వచ్చి కంటి వైద్యసేవలను ఉచితంగా పొందేవారు.

కంటి వెలుగు లేదు

కంటి వెలుగు లేదు

కంటి వెలుగు లేదు

కంటి వెలుగు లేదు