
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
ద్వారకాతిరుమల మండలంలో పోలవరం కాలువ గట్టుపై భారీ చెట్లను అడ్డగోలుగా నరికేశారు. చెట్ల కలప సంగతిని అధికారులు ఇంతవరకూ తేల్చలేదు. 11లో u
ఉజ్వల గ్యాస్
కనెక్షన్‌లపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): ఉజ్వల యోజన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ పొంది వినియోగించని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో పౌర సరఫరాల అధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉజ్వల 2.0 పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొంది రెండు సంవత్సరాలుగా రీఫిల్ చేసుకోని లబ్ధిదారుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులకు మొదటి నోటీసు జారీ చేసిన 15 రోజులలోపు వారికి సంబంధించిన గ్యాస్ పంపిణీదారుల కంపెనీకి వెళ్ళి, వారి ఈకేవైసీ ఫార్మాలిటీలు, బయోమెట్రిక్ మళ్ళీ పూర్తి చేసుకోవాలని చెప్పాలన్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి చివరి అవకాశాన్ని ఇచ్చేందుకు తుది నోటీసు జారీచేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల అధికారి ఎన్.సరోజ తదితరులు పాల్గొన్నారు.