భాషా సంస్కృతికి వన్నెతెచ్చిన భూతపురి
కడప కల్చరల్ : జిల్లాకు వన్నె తెచ్చిన మహా కవులలో డాక్టర్ భూతపురి సుబ్రమణ్యశర్మ ప్ర ముఖంగా నిలుస్తారు. అవధానిగా భాషాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల నిపుణునిగా, సంస్కృతాంధ్రంలో మ హాకవిగా పేరుగాంచారు. ఆయన 88వ జయం తి సందర్భంగా ఆదివారం సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఆయన పేరిట ఏర్పాటు చేస్తున్న స్మారక సాహిత్య పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
తెలుగు సాహితీ లోకంలో విశిష్ట స్థానం
మన జిల్లాకు కవుల గడపగా పేరుంది. ప్రముఖులైన కవులెందరో జిల్లా పేరును ఇనుమడింపజేశారు. వారిలో నిన్నటితరం కవి సంస్కృతాంధ్ర సాహితీవేత్త, మహావధాని డాక్టర్ భూ తపురి సుబ్రమణ్యశర్మ ముందు వరుసలో ఉంటారు. ఆయన రాసిన శ్రీకృష్ణభారతం తెలుగు సాహితీ లోకంలో విశిష్ట స్థానం కల్పించింది.
ఆయన అనంతరం వారి కుమారులు ఆయన పేరిట స్మారక ట్రస్టు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఓ పండితునికి సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నారు. అల్లసాని పెద్దన సాహితీ పీఠంతో కలిసి యేటా క్రమం తప్పకుండా ఈ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం ఆయన పేరిట 88వ జయంతి సందర్భంగా 23వ స్మారక అవార్డును స్థానిక ప్రముఖ సాహితీవేత్త పుత్తా పుల్లారెడ్డికి అందజేయనున్నారు.
బాల్యం నుంచే...
జిల్లాలోని తప్పెట్ల కొత్తపల్లె గ్రామంలో ఓ పండితుడు పురాణ ప్రవచనం చేస్తున్నారు. ఓ రోజు ఆయన అకస్మాత్తుగా అస్వస్తతకు గురయ్యారు. కానీ పక్కనే ఉన్న 13 సంవత్సరాల ఆయన కుమారుడు తండ్రి స్థానంలో పురాణ ప్రవచనం మొదలు పెట్టాడు. మిగతా 13 రో జులపాటు ఆ బాలుడే పురాణ ప్రవచనం చేశా డు. ఆ బాలుడు భూతపురి సుబ్రమణ్యశర్మ.
కవి డాక్టర్ భూతపురి సుబ్రమణ్యశర్మ 1938 ఫిబ్రవరి 14న వల్లూరు సమీపంలోని త ప్పెట్ల కొత్తపల్లె గ్రామంలో జన్మించారు. తండ్రి సుబ్బయ్యశర్మ మహాపండితులు ఆయన నుంచి కుమారుడు సుబ్రమణ్యశర్మకు సాహిత్య వారసత్వం లభించింది. తండ్రి వద్దే సంస్కృతాంధ్రలను అవపోసాన పట్టారు. ప్రొద్దుటూ రు మున్సిపల్ హైస్కూలులో చదివారు. ప్రభు త్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 4వ యేటనే ఛందోబద్దంగా కవిత్వం చెప్పడం మొదలు పెట్టారు. తండ్రి సుబ్బయ్యతోనే కవితా రచనలు పోటీపడి ఒప్పించేవారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వద్ద ఆశువుగా పద్యాలు, సంస్కృత శ్లోకాలు చెప్పి ఆశీస్సులు, ప్రశంసలు పొందారు. స్వామి జయేంద్ర సరస్వతి కూడా భూతపురి సాహిత్య పఠిమకు ముగ్దుడై ఆశీర్వదించి తన సభల్లో ప్రసంగానికి అవకాశం ఇచ్చారు.
బహుముఖ ప్రజ్ఞ :
డాక్టర్ భూతపురి సుబ్రమణ్యశర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిగా, అవధానిగా, జ్యోతిష శాస్త్రం, వాస్తు శాస్త్రజ్ఞులుగా రాష్ట్రేయేతర ప్రాంతాలలో కూడా పేరు పొందారు. 49 సంవత్సరాలపాటు కవితా సరస్వతిని ఆరాధించారు. ఆయన శ్రీరామభక్తుడు. తన రచనలన్నీ శ్రీరామునికే అంకితమిచ్చారు. 1989లో డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల సమక్షంలో సువర్ణ గండపేండేర సత్కారం జరిగింది. 1997లో కడప నగరంలో ఆయన గజారోహణం చేశారు. స్వర్ణ హస్త కంకణ సత్కారం స్వీకరించారు. ఉభయ కవి సార్వభౌమ బిరుదు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, పలు సాహితీ సంస్థల నుంచి ఎన్నో బిరుదులు పొందారు. ఆయన పేరిట కుమారుడు డాక్టర్ శివరామ సురేంద్రశర్మ, డాక్టర్ గోపాలకృష్ణశాస్త్రిలు స్మారక సంస్థను ఏర్పాటు చేసి యేటా ఆయన జయంతి నాడు సాహితీవేత్తకు పురస్కారం ప్రదానం చేస్తున్నారు.
నేడు 88వ జయంతి
బ్రౌన్‌లో 23వ సాహిత్య పురస్కార ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment