ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని దొరసానిపల్లెకు చెందిన న్యాయవాది నల్లగారి పద్మనాభరెడ్డి, ఆయన కుమారుడు తమ్మిరెడ్డిలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జింకా మూర్తి, జింకా సాగర్‌తో పాటు కొందరు వ్యక్తులు జీఎస్టీ స్కాం చేస్తున్నారని పద్మనాభరెడ్డి జీఎస్టీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కోపం పెంచుకున్న జింకా మూర్తి, జింకా సాగర్, నాగరాజు, శివప్రసాద్ అనే వ్యక్తులు ఆదివారం సాయంత్రం దొరసానిపల్లెలోని పద్మనాభరెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
12 మంది జూదరుల అరెస్టు
జమ్మలమడుగు రూరల్ : మండల పరిధిలోని దేవగుడి, సలివెందుల గ్రామ శివార్లలో జూదమాడుతున్న 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,12,800 స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ ఎస్. లింగప్ప తెలిపారు. ఆదివారం సాయంత్రం పోలీస్ సిబ్బందితో కలసి దాడి చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో చల్లా రమేష్ నాయుడుతో పాటు 11 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment