అధ్వానంగా రహదారి
కడప కార్పొరేషన్ : కడప నగర శివార్లలో పాలెంపల్లె నుంచి రాచనాయపల్లె వరకు ఉన్న తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కడప రింగు రోడ్డు నుంచి రాచనాయపల్లె నుంచి సుమారు 3 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు పూర్తిగా తారు లేచిపోయి గుంతలు ఏర్పడి రాళ్లు తేలి ఉంది. రామనపల్లె, మూలపల్లె, గుర్రంపాడు, ఓబులంపల్లె తదితర గ్రామాల ప్రజలు ఈ రోడ్డు మీదుగానే కడపకు రావాల్సి ఉంటుంది. రామనపల్లె నుంచి రాచనాయపల్లె వరకూ రోడ్డు బాగానే ఉందిగానీ...రాచనాయపల్లెలోనూ సగం రోడ్డు మాత్రమే సిమెంటు రోడ్డు వేసి, మిగిలిన సగం కంకర వేసి అసంపూర్తిగా ఆపేశారు. దీంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాచనాయపల్లె నుంచి కడప రింగురోడ్డు వరకూ ఉన్న రోడ్డులో వెళితే ప్రత్యక్ష నరకం కనబడుతుంది. అడుగుకో గుంతతో ఎగుడుదిగుడు ప్రయాణం వల్ల ఒళ్లు హూనం కాక తప్పదు. రోడ్డంతా రాళ్లు తేలి ఉండటం వల్ల టైర్లు తగులుకుని ఆ రాళ్లు ఎగిరిపడుతున్నాయి. వర్షాకాలంలో అయితే ఒక్కో గుంత చిన్నసైజు చెరువులను తలపిస్తోంది.
ఇటీవల కూటమి ప్రభుత్వం రోడ్లపై గుంతలను పూడ్చాలని నిర్ణయించినప్పుడు ఈ గుంతల్లో కంకర వేశారేగానీ పూర్తిగా మరమ్మతులు చేయలేదు. పంచాయతీరాజ్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఈ రోడ్డు అధ్వానంగా తయారైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగుచేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తారు లేచిపోయి రాళ్లు తేలి..
అడుగుకో గుంతతో గ్రామస్తుల
ఇబ్బందులు
గుంతల రహితమన్నారు..
గుంతలమయం చేశారు
అధ్వానంగా రహదారి
Comments
Please login to add a commentAdd a comment