
22న ఉర్దూ సాహిత్యంపై జాతీయ సదస్సు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఈ నెల 22న ఉర్దూ కవిత, సాహిత్యం్ఙపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉర్దూ విభాగం ఆచార్యులు రియాజున్నీసా తెలిపారు. సదస్సులో ఉర్దూ సాహిత్యం, దాని ప్రాముఖ్యత, ఉర్దూ స్థితి, కడపలో ఉర్దూ సాహిత్యంతిపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రవచన కర్తలు తమ వ్యాసాలను ప్రదర్శిస్తారని చెప్పారు. సాహిత్య వర్గాలు, అధ్యాపకులు, విద్యార్థులంతా సదస్సులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదనపు సమాచారం కోసం 9885348482లో సంప్రదించాలన్నారు.
హాస్టల్‌ను తనిఖీ చేసిన న్యాయమూర్తి
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ మరియాపురం, శంకరాపురం, ప్రకాశ్‌నగర్‌లలోని హాస్టళ్లను మంగళవారం తనిఖీ చేశారు. వంటశాల, వసతి గదులు, డైనింగ్ హాల్, స్టోర్ రూము పరిసరాలతోపాటు టాయిలెట్లను పరిశీలించారు. తగు సూచనలు, సలహాలిచ్చారు. విద్యార్థులకు వసతి సౌకర్యాలు, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మినారాయణ, వార్డెన్లు, విద్యార్థులు పాల్గొన్నారు
ఎస్సీ వర్గీకరణకు
ఆదేశాలు జారీ చేయాలి
కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ అన్నారు. స్ధానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్యాక్‌లాగ్‌్ ఉద్యోగాలకు, డీఎస్సీ నియామకాలు ఏబీసీడీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా మార్చిలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 20న విజయవాడలోని గాంధీ నగర్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీ.ఆంజనేయులు, ఓబులేసు, రమణ తదితరులు పాల్గొన్నారు.

22న ఉర్దూ సాహిత్యంపై జాతీయ సదస్సు
Comments
Please login to add a commentAdd a comment