నేడు ఆలయాల్లో పూజలు నిలిపివేస్తూ అర్చకుల నిరసన
రామసముద్రం : రామసముద్రంలోని ప్రధాన ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదినాన పూజలు నిలిపివేసి నిరసన తెలుపనున్నట్లు మంగళవారం అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్. నడింపల్లి పంచాయతీ బల్లసముద్రం కొండపై వెలసిన శ్రీ వాలీశ్వర స్వామికి పూర్వం నుంచి వంశపారంపర్యంగా ప్రధాన అర్చకులుగా లోకనాథ దీక్షిత్ కొనసాగేవారన్నారు. అయితే గ్రామానికి చెందిన పలువురు అర్చకుడిని తొలగిస్తున్నట్లు చెప్పడంతో అర్చకులు హై కోర్టులో పిటిషన్ వేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై సోమవారం సాయంత్రం మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, ఈఓ రమణ, కమిటీ సభ్యులతో కొండపై సమావేశం ఏర్పాటు చేసి లోకనాథ దీక్షిత్ లు ఉత్సవాల్లో కొనసాగేలా నిర్ణయించారు. అయితే ఉత్సవ కమిటీ సభ్యులు లోకనాథ దీక్షిత్‌ను కాకుండా కర్ణాటకకు చెందిన అర్చకులను నియమించారు. దీనిపై రామసముద్రం మండలంలోని అర్చకులు లోకనాథ దీక్షిత్ కు మద్దతుగా మండలంలోని అన్ని ఆలయాల్లో పూజలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే అర్చకుడు లోకనాథ దీక్షిత్ కొండ కింద బుధవారం మౌన దీక్ష చేయనున్నట్లు తెలిపారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment